పల్లవి:
మైమరచి పాడుకున్నా నాలో నేనే..
తొలి పులకింతయ్యిందేమో మరి..
కనుతెరిచే కలగంటున్నా నిన్నే..
ఏం మాయ చేసావో మరి..
నీ ఊహల వెల్లువలో ఉక్కిరిబిక్కిరవుతున్నా..
పడిలేచే కెరటంలా ఎగిసిఎగిసి పడుతున్నా..
ఓ ప్రియతమా..
చరణం 1:
నిన్నలేని అందమేదో నాలో నిద్దురలేస్తుంటే కలవరపడనా
నిన్ను చేరని ఊహలేవో కలలో మెలిపెడుతుంటే తడబడనా..
మనసు జారిపోతుందంటూ ఎవరికి చెప్పాలో..
నీ చెలిమి తీపి కావలంటూ ఎవ్వరినడగాలో...
సన్నాయిపాటై వినబడింది నీ మౌనం..
కలలో రమ్మన్నట్లు నీ ఆహ్వానం... //కనుతెరిచే కలగంటున్నా//
చరణం 2:
శతకోటి ఆశలు నిన్నే కోరుతువుంటే కాదని అననా..
మధుకావ్యమేదో మనసు రాశానంటే చదవను అననా..
తొలిచూపుల వలలో చిక్కానంటూ ఎవరికి చెప్పాలో..
వసంత భావాల వియోగాలు ఎక్కడ దాచాలో..
సిరిమల్లె ధూపమై ఎగిసింది నీ శ్వాస..
మధుమాసం చేరువై వెలిగింది నీ రూపం.. //మైమరచి//

No comments:
Post a Comment