10
My Today's song on the
Eve of Legend BalaSubramanyam gari Birthday...
పల్లవి:
Happy Birthday To U..Happy Birthday To U..
చందనపు గంధాల నడుమ విహరించింది నా మది..
ద్వీపాంతరాలను తాకివచ్చే పరిమళాన్ని తాగింది నా మది..
ఎక్కడ నుండి తాకెనో ఆ మధురగానం
మైమరచిపోయేలా ప్రతీ రసహృదయం..
ఎల్లలు లేని సంగీత ప్రపంచమే నీదిగా..
పాడావు పాటలను మకుటంలేని మహారాజుగా..
చరణం 1:
వెన్నెల్లో వినాలనిపించే సన్నాయిగీతికలా..
వెన్నెల్లో ఆడపిల్లలై పదాలు నీ పెదవుల్లో
నీ పాటకు తలఊచని హృదయమేదీ
నీ గమకానికి తలవంచని రాగమేదీ
అలరిస్తావు నీ గాత్రముతో రసశ్రోతలను
రంజిస్తావు నీ మాటలతో అభిమానులను..
Happy Birthday To
U..Happy Birthday To U...
చరణం 2:
గంధారాన్ని ఆలపించే గానగాంధర్విలా
మువ్వల్లా రవళించే రాగాలు నీ గొంతులో..
నీ పాటకు పరవశించని మనసేదీ
నీ గానములో ఒదగలేని పదములేవీ
మురిపిస్తావు గండుకోయిలనే నీ రాగాలతో..
అగ్రనటులనే మాయజేస్తావు నీ ఇంద్రజాలముతో..
చరణం 2:
గంధారాన్ని ఆలపించే గానగాంధర్విలా
మువ్వల్లా రవళించే రాగాలు నీ గొంతులో..
నీ పాటకు పరవశించని మనసేదీ
నీ గానములో ఒదగలేని పదములేవీ
మురిపిస్తావు గండుకోయిలనే నీ రాగాలతో..
అగ్రనటులనే మాయజేస్తావు నీ ఇంద్రజాలముతో..
Happy
Birthday To U..Happy Birthday to U..
No comments:
Post a Comment