Tuesday, 17 November 2015

పాట : 14 : Solo Song


Good Afternoon friends..my feel good solo song of a lovely woman for today...:)

పల్లవి:
కమ్మని రాగమేదో పలికింది గొంతులో..
వెచ్చని ఊసేదో మెదిలింది గుండెలో
అనురాగ నాదమేదో తొణికింది మనసులో..
అది పల్లవిగా మారిందీనాడు పెదవిలో..

చరణం 1:
రేయికి నిదురే కరువయ్యింది మల్లెలు నవ్విన సవ్వడికే
కంటికి రెప్పే బరువయ్యింది కలలకు లొంగని కాటుకకే
రాగచంద్రికల భావమేదో మది పాడగా
తీయనిపలుకుల గానమేదో జతే చేరగా
రసడోలలూగింది అడుగడుగునా..         //కమ్మని //

చరణం 2:
మనసుకు దాహం మొదలయ్యింది వెన్నెల విరహపు మురిపెముకే
ఊహల సందడి మొలకెత్తింది తలపు సుమాల మధురిమకే
నింగి తారకల మెరుపులేవో మది మీటగా
వలపు గీతికల చినుకులేవో ఒడే నింపగా
వసంతాలాడింది అణువణువునా..           //కమ్మని//












No comments:

Post a Comment