My duet song for
Today..
పల్లవి
ఆమె: నవవసంతంలో మధుర వేణుగానం
కలకోయిల గొంతులో ప్రియ మోహనరాగం
నీదేనా..అది నీవేనా..
అతను: ఆకాశవెన్నెల్లో పరిమళ విరహనాదం
అరవిరిసిన మోములో అమృతానందమోదం
నీదేనా..అది నీవేనా..
చరణం 1.
అతను: నీరెండ సంధ్యవెలుగుల్లో నీడై
నడిచింది నీవేనా
మౌనంగా చిరుమందహాసం చేసిన రూపం
నీదేనా..
ఆమె: మధురోహల దోసిళ్ళలో
ముత్యాలతలంబ్రాలు నింపింది నీవేనా
వసంతరాగాల వన్నెల కోయిలకు విరహాన్ని
నేర్పింది నీవేనా...
నీవేనా...నా నీవేనా
చరణం 2.
ఆమె: నిశిరాత్రి జాబిల్లివెన్నెల్లో
ప్రేమలేఖలు రాసింది నీవేనా
మగత కన్నుల కునుకుల్లో మాయచేసిన
స్వప్నం నీదేనా..
అతను: తారలమ్మ కూటమిలో మరుదివ్వెను
వెలిగించింది నీవేనా..
ఉవ్వెత్తిన సాగరకెరటంలో తెల్లని
నురుగై మెరిసింది నీవేనా..
నీవేనా నా నీవేనా
No comments:
Post a Comment