పల్లవి:
అతను:
అపూర్వసంగమమే మనది
ఆనందానికి చిరునామా అయినది
జాబిలికే పులకలు పుట్టించినది
రాతిరికే గమకాలు నేర్పించినది
ఆమె:
అపూర్వసంగమమే మనది
ఆనందానికి చిరునామా అయినది
జాబిలికే పులకలు పుట్టించినది
రాతిరికే గమకాలు నేర్పించినది
చరణం 1.
ఆమె:
ఎన్నోజన్మల అనుభూతిఫలమో నా భావమయినావు
ఎన్ని పున్నముల వెలుగులజగమో నా
లోకమయినావు
అతను
నీవే నా సంగీతము
నేనే నీ మధుమాసము
ఆమె
మనదేలే సంయోగమూ..సంతోషమూ..
చరణం 2.
అతను
ఎన్నిరుతువుల సౌందర్యగనివో నా
అందమయినావు
ఎన్నిసొగసుల లావణ్యసిరివో నా
సొంతమయినావు
ఆమె
నీవే నా వసంతమూ
నేనే నీ ప్రియగీతమూ
అతను
మనదేలే ఆకాశమూ..అనంతమూ..
No comments:
Post a Comment