పల్లవి:
చేయక తప్పదు పోరాటం..
లక్ష్యం సిద్ధించాలని నీవనుకుంటే..
వేయక తప్పదు తొలి అడుగు..
గెలుపు వరించాలని నీవనుకుంటే..
దాసోహమప్పుడేగా ఈ లోకం..విజేతవని నువ్ నిరూపించుకుంటే..
చరణం 1:
కెరటమై సాగాలి ముందుకే నువ్వలా..
ప్రకృతి నిన్నెంత వెనుకకు తోసినా
నింగికే ఎగరాలి పట్టుదలతో గువ్వలా..
అయస్కాంతమై భూమెంత కిందకు లాగినా
దిక్కులు చూడటమెందుకలా..దిశను నిర్దేశించుకున్నాక..
రెండో ఆలోచన చేయకలా..సాగిపో గమ్యం ఎదురుపడగా..
దాసోహమప్పుడే ఈ లోకం..విజేతవని నువ్ నిరూపించుకుంటే.. //చేయక//
చరణం 2:
వజ్రమై మెరవాలి సానబెట్టిన రాయిలా..
ముత్యమై నవ్వాలి వికసించిన మోములా
చిరునవ్వి ఛేదించాలి ఎదురైన సమస్యనలా
స్వయంకృషి చేసి సాధించాలి స్వర్గాన్నలా..
వర్తమానాన్ని నిరుత్సాహంతో నింపకలా..ఆనందకర భవిష్యత్తుని ఊహించిక..
నిద్దురలో సమయాన్ని గడపకలా..నిజమయ్యే స్వప్నాన్ని వెంటాడికా...

No comments:
Post a Comment