Tuesday, 17 November 2015

పాట : 12

12.


పల్లవి:
అతడు: ఆమని సొగసుల అలివేణి..చైత్ర కోయిలల కలవాణి
అతి మధురాల జవ్వని..
అందుకో తొలివలపు బహుమానం..నా మనసునే నైవేద్యం..
ఆమె: చల్లని వెన్నెల చందురుడా..సహస్ర కన్నుల ఇందురుడా..
చిరునవ్వుల చెలికాడా..
అందుకున్నా నీ బహుమానం..చేసా మనసును కైంకర్యం..

చరణం 1:
అతడు: తొలిసారి చూసినప్పుడే మది గానం చేసింది..
నీ తొలిపిలుపు తొందరలకే ఎద తహతహలాడింది..
ఆమె: తొలివలపు పులకరింతకే మది నాట్యమాడింది..
తొలిప్రేమ అనుభవానికే నేనెదురు చూసింది..
ఏ దైవం కరుణించిందో..
మన ప్రణయం ఫలియించింది..ఇద్దరినీ ఒక్కటి చేసింది..

చరణం 2:
ఆమె: తొలీడుగు నీవైపే సిగ్గునొదిలి కదిలింది..
తొలిస్పర్శ సోకినప్పుడే మనసు చెమరించింది..
అతడు: తొలిముద్దు కానుకకే అధరమెర్రనై మెరిసింది..
తొలిపాట పల్లవించి ఈ జగమునే మరిపించింది
ఏ ప్రేమవై దరిచేరావో..
నా నిరీక్షణ ఫలియించింది..నిన్ను నాదాన్ని చేసింది..


No comments:

Post a Comment