పల్లవి:
కురిసింది వాన అనుకోకుండానే..
నిన్ను నాతో తడపాలనో..
నా మనసు నీకు తెలపాలనో..
ఇరువురిని ఒకటి చేయాలనో..
చరణం 1.
వేసవి మల్లెలవాన మరలిపోయిందిగా
నీ తలపుల జడివానలో మునకేసే ననుచూసి..
రాతిరి వెన్నెలవాన చినబోయిందిగా
నీ ఊహలవెల్లువలో నేను తడిచానని
ఆకుల గలగలలు..కోయిల పాటలు..
అన్నీ తలలూపాయిగా నా భావనకి..
మధురిమను పెంచాయిగా నా అనుభూతికి..
// కురిసింది//
చరణం.2
కురిసే పూలవాన కలగంటోందిగా
నీ చిరునవ్వులకు తాను తోడవ్వాలని..
మెరిసే స్వాతివాన జ్వలిస్తోందిగా
నీ ప్రేమతొలకరులు తాను ఓపలేనని..
పువ్వుల గుసగుసలు..గువ్వల కువకువలూ
అన్నీ రాగాలందించాయిగా నా
సంగీతానికి..
పల్లవీ చరణాలై ఒదిగాయిగా నా
గీతానికి..
// కురిసింది//
No comments:
Post a Comment