Tuesday, 17 November 2015

పాట : 3


చరణం

ఇంద్రజాలికుడివా..మనోరంజిల్లింది మూగైన నా మనసు
ఉల్లాసనాదానివా..తలఊచింది పులకించిన నా శిరసు
ఎవరివో..నీవెవరివో..
పల్లవి 1

ఒంటిచేతికి చప్పట్లు రావని రెండుచేతులూ కలిపావు
కలిసున్నా చేతివేళ్ళు దేనికవే ప్రత్యేకమనీ తెలిపావు
చెలిమందించే చేతులవిలువ చాటి చెప్పావు
చీకటి జగాన కరదీపికవై దివ్వెలు నింపావు
ఎవరివో..నీవెవరివో..

పల్లవి 2

మనసుంటే మార్గం దొరుకునని మంత్రమే వేసావు
ఊహాశక్తితో చరిత్ర మారునని స్పష్టం చేసావు
మంచితనానికి వన్నెతరగదని ఋజువు చూపావు 
నాలో మనిచిని మేల్కొలిపి స్పందన నేర్పావు

ఎవరివో..నీవెవరివో..

No comments:

Post a Comment