Hi friends..My
Romantic Duet for this Week..:)
పల్లవి:
అతను: ఏదో చెప్పలనుంది..మనసులోని
మాట..
నువ్వు మెచ్చి వినాలనుకొనే మరుమల్లె
మాట..
ఆమె: ఏదో వినాలనుంది..నీ మదిలో మాట..
నేను నచ్చి మెచ్చాలనుకొనే అరుదైన
మాట..
చరణం 1:
ఆమె: గుప్పిళ్ళు తెరిచింది గోరువంక..
గుండెల్లో నేనున్నానని చెప్పేందుకే..
పెదవుల్లో పూసింది నెలవంక..
నవ్వుల్లో చేరానని తెలిపేందుకే..
అతను: గుండెల్లో చేరినా..నవ్వుల్లో
చేరినా..
నువ్వుంది నాలోనేగా...నేనుంది
నీలోనేగా... //ఏదో వినాలని//
చరణం 2:
అతను: కౌగిళ్ళు కోరాయి కొన్నందాలు..
మనసైన నీ పొందు కావాలనే..
సందళ్ళు చేసాయి సన్నాహాలు..
వరసైన నిను చేరి విరియాలనే..
ఆమే: కౌగిళ్ళు కోరినా..సందళ్ళు
చేసినా..
సమయం రావాలిగా..మనమొకటై మిగలాలిగా.. //ఏదో చెప్పాలని//
No comments:
Post a Comment