Tuesday, 17 November 2015

పాట : 5.

పల్లవి:

మౌనాన్ని వీడమంది మనసు నీ చూపు వెతికింది నన్నని తెలిసి
ముత్యాల దండయింది సొగసు నీ రూపు వరించింది నన్నని మురిసి
ఎన్నని చెప్పనూ..
మది చిలుక పలికిన తీయని మాటలను..

చరణం 1

విరహించిన మోవికెన్ని రాగాలో ప్రతీరాగమూ నిన్నే పాడమంటూ
సెలయేరైన హృదికెన్ని తరగలో ప్రతీవెల్లువలో నిన్నే తడుముకుంటూ
నన్ను నీలో కలిపేసావా నీ ఊహ నాదంటూ
నన్ను నాకే విడిచేసావా నా ప్రేమ నీవంటూ
ఎన్ననీ చూపనూ..
మది మయూర్మై ఆడిన ప్రతినృత్యం..

చరణం 2:

అరవిరిసిన మోముకెన్ని కెంపులో ప్రతీఒంపులో నిన్నే అలదుకుంటూ
నిమీలిత నయనాలకెన్ని మత్తులో ప్రతీ గమ్మత్తులో నిన్నే కలుసుకుంటూ
నువ్వు నాతో వచ్చేసావా నా శ్వాస నీవంటూ
నన్ను నీలో దాచేసావా నీ ప్రాణం నేనంటూ
ఎక్కడనీ దాచనూ..

ఆకాశమై ఎగిసే ఆనందపు హరివిల్లును..

No comments:

Post a Comment