Tuesday, 17 November 2015

పాట : 11


Hi friends..My feelgood Song for today...

పల్లవి:

ఏ శుభమూర్తమో ఇది..ఏ ఆమని గీతమో ఇది
నిత్యవసంతమై పాడింది మది..
ఎదలోయల్లో మునుపెరుగని సడి..

చరణం 1:

మధుమాస గీతికలేవో పెదవులపై పలికినవి..
తొలిసంధ్యల కానుకలేవో కన్నులపై ఒదిగినవి..
ఆరుకాలాలూ ఏకమై ఒకే ఋతువుగా శోభిల్లినవేమో
కలహంస అడుగుల ఒయ్యారాలు
అరవిరిసిన పువ్వుల సౌందర్యాలు..
మురిసిపోదా మనసు..కురిసిపోదా మధువు..    //ఏ శుభమూర్తం//

చరణం 2:

నీలిమబ్బు సోయగమేదో నా మనసును అల్లినది
కలకోయిల కూజితమేదో హృదివీణను మీటినది
సప్తస్వరాలూ ఏకమై ఒకే రాగమాలపించెనేమో
నెమలికులుకుల ఆ హొయలు..
చిగురుటాకుల స్వర గలగలలు..
తరించిపోదా తనువు..వరించిరాదా మనువు..  //ఏ శుభమూర్తం//



No comments:

Post a Comment