పల్లవి
ఆమె:
అందించాలని ఉందో సందేశం నీకందించాలని
ఉందో సందేశం అది నా అనురాగ సంకేతం అది నా అంతరంగ తరంగం అందుకో
నేస్తమా.... ఆత్మీయ ప్రియతమా
అందుకో నేస్తమా.... ఆత్మీయ
ప్రియతమా
అతడు:
అందించవా చెలీ ఆ సందేశం నాకందించవా
చెలీ ఆ సందేశం అది నేనెదురు చూసే సంకేతం అది నా నిరీక్ష పరీక్షా ఫలితం అందించవే
నేస్తమా... ఆరవ నా ప్రాణమా అందించవే నేస్తమా... ఆరవ నా
ప్రాణమా
చరణం 1
ఆమె:
మేఘాలతో పంపించనా సందేశం
జలధారగా కురిసి నిన్ను నిలువెల్లా
ముంచదుగా
రాయంచతో కబురంపించనా సందేశం
ఎగిరే విలాసమై నా సంగతే మరువదుగా
అతడు:
చిలుకతో చెప్పించవా సందేశం
నీ ముద్దుమాటలతో నను మైపరపించేనుగా
కలువలతో వివరించవా సందేశం
తన రెక్కలువిప్పి నీ మనసు చూపుతుందిగా //పంపాలనుందో//
చరణం 2
అతడు:
నీ లేతపెదవులే తాకాయనుకున్నా
చిరుగాలి అలవోకగా నను ముద్దాడిపోతుంటే
నీ చిరునవ్వుల గలగలలనుకున్నా
సెలయేరలా ఒయ్యారపు సవ్వడే చేస్తుంటే
ఆమె:
నీ శ్వాసలే సుమాలై పూచాయనుకున్నా
నా మది పరిమళమై పులకరించిపోతుంటే
నీ రాగమే అనంతమై వినిపించిందనుకున్నా
నాలో విరహం ఆకాశానికి ఎగిరిపోతుంటే //పంపాలనుందో//
No comments:
Post a Comment