Tuesday, 17 November 2015

పాట : 9


నా భావగీత మాలికతో శుభోదయం మిత్రులారా..

నీ ధ్యానములో నా గానమిది..
నీ చరణములో నా పల్లవిది
నీ పొందికలో నా భావమిది..
నీ కన్నుల్లో నా రూపమిది..
నిజమేగా చెలికాడా...అవుననవో జతగాడా...

మలయమారుతమై అల్లేయనా మౌనవించిన తొలిసంధ్యల్లో..
చుక్కల ఆకాశమే దించేయనా చల్లని మునిమాపుల్లో..
పున్నమి వెన్నెలను కరిగించనా నడిరాతిరి నిరీక్షణల్లో..
హృదయాలాపన వినిపించనా కిన్నెరవీణల తీవెల్లో..
చెప్పవా చెలికాడా...నన్ను వలచిన వన్నెకాడా..

మెరుపు సుగంధాలు వెదజల్లనా పుప్పొడి వసంతాలలో..
ప్రియ రాగరంజితం చేసేయనా వలపు శ్రీగంధాలలో.. 
చూపుల శుభలేఖలు రాసేయనా తలపుల కావ్యాలలో..
ప్రేమపావురమై ఒడిచేరనా ఆరాధనా పిలుపులలో..
చెప్పవా చెలికాడా...నన్ను వలచిన వన్నెకాడా 











No comments:

Post a Comment