పల్లవి: ప్రియతమ సఖుడా..
శుభోదయమయ్యింది నేడు నీకు శుభాకాంక్షలు అందించేందుకే..
వసంతోత్సవం ఓలలాడింది చూడు నిన్ను పలకరించేందుకే..
అందుకో ప్రియతమ..మనసైన మధురవచన..
Happy Birthday to U...
Every word is sounding
like a lyric..when I'm calling U..
Every
thought is becoming a poem..when I'm writing U..చరణం 1: దూరాలెందుకు లెక్కిస్తావో తలపుల్లో నీ చెంతనేనుండగా
నీ ఆత్మానందం నేనయ్యాగా మక్కువగా నన్నే తలవగా
చిగురించిన ప్రేమ నేనేగా నీ హృదయానందమునా..
వెన్నెల మంచుబిందువును నేనేగా నీ హేమంతవేకువనా..
అందుకో ప్రియతమా...మనసైన మధురవచనా...
చరణం 2: ఎన్నెన్ని పూజలు చేసానో నిను గెలిచే తపనే తీరగా
కలభాషణలెన్ని నేర్చానో నిను వలచిన ఆ రోజునా ..
విరహించిన వరూధిని నేనేగా నిను ప్రేమించినందునా..
నువ్వాశించిన మకరందమైపోనా అరవిరిసిన పువ్వుల నడుమనా..
అందుకో ప్రియతమా...మనసైన మధురవచన...
No comments:
Post a Comment