పల్లవి..
మనోసాగరిక నేనేగా నీ మనసు కెరటమై
ఉప్పొంగేవేళ
నిండుజాబిల్లి నేనేగా నీ మనసు గగనాన్ని
చుంబించేవేళ..
అన్నీ నేనే కావాలి..నీ మనసు నేనై నిండాలి..
చరణం.1.
నేనేగా రాధికను నీ మనసో మధువనమనుకుంటే..
నేనేగా గీతికను నీ మనసో
స్వరమధురిమనుకుంటే..
నేనేగా పల్లవయ్యింది నీవో
చరణమాలపిస్తుంటే..
నేనేగా నవ్వునయ్యింది నీవో
ఆనందమనుభవిస్తుంటే..
నేనేగా నీకన్నీ అనుసరిస్తున్నా
జీవనస్రవంతినై...
!! మనోసాగరిక !!
చరణం.2.
నేనేగా గమకమును నీ మనసో
గానమాలపిస్తుంటే..
నేనేగా తమకమును నీ మనసో
ఊహనల్లుకుంటుంటే..
నేనేగా పరిమళించింది నీవో
శ్వాసనందిస్తుంటే..
నేనేగా పులకరించింది నీవో
పరవశమవుతుంటే..
నేనేగా నీవెంట నడిచొస్తున్నా
ప్రతీఅడుగునై..
!! మనోసాగరిక !!
No comments:
Post a Comment